: ఎలుకను పడితే పది... ఏపీ సర్కారు ఆఫర్!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందును ఎలుక కొరికినటువంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా ఉండేందుకు సర్కార్ కొత్త ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వాస్పత్రుల్లో కుప్పలు తెప్పలుగా ఉన్న ఎలుకలను పట్టుకోవాలని నిర్ణయించింది. పట్టుకున్న ప్రతి ఎలుకకూ రూ.10 చొప్పున ఇస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఎలుకలు పట్టుకునే వారికి ఇక చేతినిండా పని దొరికినట్లయింది. అయితే ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం ఎలుకలు మాత్రమే కాదు పందొకొక్కులు కూడా ఉన్నాయి. మరి, వాటి సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు.

  • Loading...

More Telugu News