: ఇకనైనా డేటింగ్ మానుకో: బ్రిట్నీ స్పియర్స్ కు తండ్రి మందలింపు


ప్రముఖ పాప్ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్ ను ఆమె తండ్రి మందలించాడట. తరచూ బాయ్ ఫ్రెండ్స్ ను మార్చడం సరికాదని, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని డేటింగులకు దూరంగా ఉండాలని కాస్తంత గట్టిగానే చెప్పాడట. ఇటీవల తన లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ చార్లీ ఎబెర్సాల్ నుంచి బ్రిట్నీ విడిపోయిన సంగతి తెలిసిందే. చార్లీ దూరం కావడంతో, మానసికంగా ఆమె వేదనకు గురవుతోందని గుర్తించిన బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్, ఆమెను ఓదార్చే పనిలో ఉండగా, తనకు మరో ఫ్రెండ్ దొరికితే, చార్లీని మరచిపోతానని ఆమె తెగేసి చెప్పిందట. ఈ విషయంలో కుమార్తె వాదనతో ఏకీభవించని ఆయన, ఈ తరహా తిరుగుళ్లు ఇక వద్దని హితవు పలికినట్టు పాశ్చాత్య మీడియా కథనాలు ప్రచురించింది. ఇప్పటికే కెల్విన్ ఫెదర్ లైన్, జాసన్ అలెగ్జాండర్ లను వివాహం చేసుకుని ఆపై బ్రిట్నీ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూ వార్తల్లో నిలుస్తోంది.

  • Loading...

More Telugu News