: మరోబిడ్డకు జన్మనివ్వనున్న రాయల్ ఫ్యామిలీ లేడీ!
బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో సభ్యుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన కేథరిన్ కేట్ మిడిల్టన్ మరోసారి ప్రెగ్నెంట్ అయిందన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. నాలుగు నెలల క్రితం ప్రిన్సెస్ చార్లెట్టీకి జన్మనిచ్చిన కేట్ మిడిల్టన్ మరోసారి గర్భవతి అయింది. ఈ విషయాన్ని 'హాలీవుడ్ లైఫ్' ప్రత్యేక కథనంలో పేర్కొంది. రాయల్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే వారి ద్వారా ఈ సమాచారం సేకరించినట్టు తెలిపింది. కేట్ మిడిల్టన్ కు ప్రస్తుతం 35 సంవత్సరాలు కాగా, 40 ఏళ్లు వచ్చేలోపు మరో బిడ్డను కనాలన్న ఉద్దేశంలో ఆమె ఉందని 'హాలీవుడ్ లైఫ్' వెల్లడించింది.