: విలువలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే: రాష్ట్రపతి
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు విలువలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసిన సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ఆయన మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలోనే కుల, మత, లింగ, వర్గ, వైషమ్యాల్ని తుడిచివేసే విధంగా, అందరూ సమానమేనని భావించేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయాలని సూచించారు. భావి భారతావని బాధ్యతను భుజాలపై మోసే పౌరులుగా విద్యార్థులను ఉపాధ్యాయులు తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు స్వతహాగా చైతన్యవంతులు కావాలని ఆయన తెలిపారు.