: విండీస్ టెస్టు కెప్టెన్ గా హోల్డర్


వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ గా జాసన్ హోల్డర్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించిన దినేష్ రామ్ దిన్ స్థానంలో జాసన్ హోల్డర్ ను కెప్టెన్ గా నియమించినట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. బోర్డు డైరెక్టర్లంతా జాసన్ హోల్డర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చీఫ్ సెలెక్టర్ క్లైవ్ లాయిడ్ తెలిపారు. కాగా, గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాసన్ హోల్డర్ కేవలం 8 టెస్టులే ఆడాడు. టెస్టుల్లో ఆడడం ప్రారంభించిన కొద్దికాలానికే జాసన్ హోల్డర్ కు జట్టు పగ్గాలు అప్పగించడం విశేషం. వెస్టిండీస్ వన్డే జట్టు బాధ్యతలు మోస్తున్న జాసన్ హోల్డర్ కే టెస్టు బాధ్యతలు అప్పగించడంతో జట్టు స్థిరమైన ప్రదర్శన చేస్తుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, విండీస్ జట్టు అక్టోబర్ లో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.

  • Loading...

More Telugu News