: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టి రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేసిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నేటి మధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ లో చోటుచేసుకున్న అంశాన్ని చర్చించారు. అధికార పార్టీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ నేతలంతా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.