: ఆర్ఎస్ఎస్ నడిపిస్తోందనడంలో వాస్తవం లేదు: రాజ్ నాథ్ సింగ్
గత మూడు రోజుల పాటు ఢిల్లీ వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్, బీజేపీ సమన్వయ సమావేశాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలను అనుసరించే ప్రభుత్వం నడుస్తోందనడంలో అర్థం లేదన్నారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. అంతేగాక తాను, ప్రధాని ఆర్ఎస్ఎస్ సేవకులమేనన్న వ్యాఖ్యపైనా రాజ్ నాథ్ మాట్లాడుతూ, తాను, మోదీ స్వయం సేవకులమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి ఇబ్బందికి గురి కావల్సిన అవసరం లేదని చెప్పారు. ఈరోజు పూణెలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన ప్రభుత్వ విషయాలు వారితో పంచుకుంటామనడం సరికాదని, అసలు అలాంటి ప్రస్తావనే రాలేదని చెప్పారు.