: ముస్లింల కొత్త ఉద్యమం ఇదే!
ముస్లింల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీబీ) నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయపడుతోంది. స్కూళ్లలో యోగా, సూర్యనమస్కారం, వందేమాతర గీతాలాపన వంటి చర్యలతో రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక నియమాల్ని పక్కనబెట్టి ఒకే మతానికి చెందిన నియమ నిబంధనలు పాటించాలని కేద్రం ఒత్తిడి తెస్తోందని ఏఐఎంపీబీ పేర్కొంది. దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. దీనిపై సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. ఇతర మైనారిటీ వర్గాలను కలుపుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఏఐఎంపీబీ స్పష్టం చేసింది. "దీన్ ఔర్ దస్తర్ బచావ్" (సేవ్ రెలిజియన్ అండ్ కాన్సిట్యూషన్) పేరుతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు.