: మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం...అయితే, మంత్రి ప్రకటన స్పష్టంగా లేదు!: మాజీ సైనికులు


రక్షణ మంత్రి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ సైనికులు ప్రకటించారు. అదే సమయంలో రక్షణ మంత్రి ప్రకటన స్పష్టంగా లేదని వారు తెలిపారు. సైనికులెవరూ ముందుగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావించరని, ప్రమోషన్ లభించిన వారంతా పై స్థాయిల్లో సౌకర్యాలు అనుభవిస్తారని, అదే సమయంలో వారితో సమానమైన సామర్థ్యం కలిగి, అవకాశం లభించని వారు మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటారని వారు పేర్కొన్నారు. అలాంటప్పుడు వారితో పాటు సమానమైన పెన్షన్ సౌకర్యం పొందడం అసమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు. అలాగే పాత బకాయిల విషయంలో రక్షణ మంత్రి ప్రకటన సరికాదని వారు అన్నారు. 2014 పెన్షన్ బకాయిలు నాలుగు దఫాలుగా చెల్లిస్తామనడం సరికాదని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News