: ఎమిరేట్స్ విమానం చెన్నైలో అత్యవసర ల్యాండింగ్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎమిరేట్స్ విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దుబాయ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న ఎమిరేట్స్ కు చెందిన ఈకే-346 విమానంలో 61 ఏళ్ల ప్రయాణికుడు గుండె నొప్పితో బాధపడ్డాడు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సిబ్బంది సమాచారమందించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానం ల్యాండ్ చేయాల్సిందిగా సూచించారు. దీంతో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న వైద్యులు బాధితుడికి ప్రాథమిక చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించారు.