: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: ఎర్రబెల్లి
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ తీరుపై టి.టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆత్మహత్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. రుణమాఫీపై తూతూమంత్రంగా ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోందని విమర్శించారు. రుణమాఫీలో రూ.1000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని మంత్రి ఈటెల రాజేందరే ఒప్పుకున్నారని చెప్పారు. తెలంగాణలో అన్ని మండలాల్లో కరవు ఉందన్న ఎర్రబెల్లి, అన్ని మండలాల్లోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.