: గుప్తనిధుల కోసం ఇంట్లో తవ్వకాలు మొదలెట్టిన ఆదిలాబాద్ జిల్లా వాసి


ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలోని స్థానిక గోదావరి రోడ్డులో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఎండీ సలీం అనే వ్యక్తి ఇంట్లో రెండు రోజులుగా రాత్రి సమయంలో చప్పుడు వస్తున్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, అతని ఇంట్లో పోలీసులు పరిశీలించగా ఇంటి మధ్య భాగంలో పెద్ద గొయ్యి కనిపించింది. ఎందుకు గొయ్యి తీసారని పోలీసులు అడగ్గా సలీం, అతని కుటుంబ సభ్యులు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చి వారందరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అయితే గుప్త నిధులు ఉన్నాయన్న అపోహతోనే ఇంట్లో గొయ్యి తీస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News