: డ్రాగన్ పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్


సూపర్ హీరో తరహా పాత్రలు పోషించే అవకాశాలు ఎప్పుడో కానీ రావు. ఎందుకంటే, అందుకు తగ్గా కథల్ని సృష్టించడం అంత తేలికైన విషయం కాదు. బాలీవుడ్ విషయానికొస్తే హృతిక్ రోషన్, షారూఖ్ ఖాన్ ఈ తరహా పాత్రలు పోషించారు. ఇప్పుడు ఆ ఛాన్స్ యువ హీరో రణబీర్ కపూర్ కు దక్కింది. ఆయన ప్రధాన పాత్రలో ఓ సూపర్ హీరో సినిమాను తెరకెక్కించే పనిలో డైరైక్టర్ అయన్ ముఖర్జీ ఉన్నారు. రణబీర్ కపూర్ ను డ్రాగన్ లా చూపించనున్న ఈ సినిమాకు మన పురాణాలే స్ఫూర్తి. మూడు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అయితే, హాలీవుడ్ సినిమా స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News