: తిరుపతి యాసిడ్ దాడి బాధితురాలి మృతి


చిత్తూరు జిల్లా తిరుపతిలో యాసిడ్ దాడికి గురైన జరీనా బేగ్ అనే మహిళ చనిపోయింది. గత 45 రోజుల నుంచి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ ఉదయం కన్నుమూసింది. ఆమె పీలేరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. జులై 15న జరీనాపై మాజీ భర్త ఖాజా హుస్సేన్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివాహ సమయంలో తాను ఉద్యోగం చేస్తున్నానని, ఆస్తులున్నాయని నమ్మించాడు. పెళ్లయ్యాక అవన్నీ అవాస్తవమని తేలింది. అంతేగాక అతను ఏ పని లేకుండా తిరిగేవాడు. దాంతో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిందట భర్త నుంచి జరీనా విడాకులు తీసుకుంది. అయినప్పటికీ హుస్సేన్ ఆమెను వేధించేవాడు. దాంతో ఆమె పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు కూడా నమోదు చేశారు. కక్ష పెంచుకున్న హుస్సేన్ జరీనాపై యాసిడ్ తో దారుణంగా దాడి చేశాడు.

  • Loading...

More Telugu News