: 17న సింగపూర్ కు ఏపీ సీఎం చంద్రబాబు పయనం... 20న తిరిగి రాక
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 17న సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల ఆహ్వానం, స్మార్ట్ సిటీల నిర్మాణం తదితర అంశాలపై ఈ సందర్భంగా చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. వచ్చే నెల 22న జరగనున్న నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని సింగపూర్ ప్రధానిని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. సింగపూర్ పర్యటనకు ఈ నెల 17 అర్ధరాత్రి బయలుదేరనున్న చంద్రబాబు 20న రాష్ట్రానికి తిరిగి వస్తారు.