: గూగుల్ ఆఫీసులో రాజమౌళి... ఉద్యోగులతో సరదాగా కాసేపు!
బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి శుక్రవారం నాడు హైదరాబాదులోని గూగుల్ ఉద్యోగులతో ముచ్చటించారు. గూగుల్ ప్రాంగణానికి వెళ్లిన ఆయన అక్కడి ఉద్యోగులతో సరదాగా కాసేపు గడిపారు. ఎంప్లాయీస్ అడిగిన ప్రశ్నలకు ఆయన తన శైలిలో సమాధానమిచ్చారు. ఆ ప్రదేశం తనకు ఎంతో నచ్చిందని, గూగుల్ ప్రాంగణాన్ని దర్శించడం తనకు దొరికిన గొప్ప అవకాశమని, అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు. రాజమౌళితో పాటు బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు కూడా పాల్గొన్నారు.