: త్రిష ఫాలోవర్స్ ఇప్పుడు 20 లక్షల మంది
దక్షిణాది అందాలభామ త్రిషకు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు తన ఫాలోవర్స్ సంఖ్య 20 లక్షలకు చేరిందని త్రిష తెలిపింది. ఈ సందర్భంగా అభిమానులకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలు, ఇష్టాయిష్టాలు వంటి అంశాలను ట్విట్టర్ ద్వారా అభిమానుల ముందు ఉంచుతున్న త్రిష తన ఖాతాను 2009 జులైలో ప్రారంభించింది. సహజనటుడు కమల్ హాసన్ నటించిన, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 'చీకటి రాజ్యం' చిత్రంలో ప్రస్తుతం త్రిష నటిస్తోంది.