: పాత్రికేయుల అభిప్రాయాల ప్రచురణపై ఇజ్రాయెల్ నిషేధం
వార్తాపత్రికలలో జర్నలిస్టుల అభిప్రాయాలను ఇజ్రాయెల్ ప్రభుత్వం నిషేధించింది. పాత్రికేయులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు పత్రికల్లో వెల్లడించరాదని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత్రికేయుల అభిప్రాయాలపై నిషేధం విధిస్తూ చట్టం చేసింది. ఆ చట్టాన్ని గురువారం రాత్రి ఆమోదించింది. కొన్ని మీడియా ఛానెళ్లు పత్రికా విలువలు పాటించకుండా రాజకీయాలు చేస్తున్నాయని, అందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ చట్టం కేవలం వార్తా సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, దీనిని అమలు చేయవద్దంటూ ఇజ్రాయెల్ ప్రెస్ కౌన్సిల్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. చట్టం ఎలా పనిచేస్తుందనే దానిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం వివరించకపోవడం విశేషం.