: ప్రభుత్వ ధాన్యాన్ని తాకట్టు పెట్టి... లోన్ తీసుకున్న మిల్లు యజమాని
చాలా మంది నకిలీ పత్రాలు, నకిలీ సంస్థల పేర్లతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మోసం చేస్తుంటే ఇక్కడో మిల్లు యజమాని ప్రభుత్వ ధాన్యాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. తీసుకుంది అంతా ఇంతా కాదు... రూ.1.5 కోట్ల లోన్! పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడిలోని శ్రీనివాస రైసు మిల్లులో ప్రభుత్వం ధాన్యాన్ని నిల్వ ఉంచింది. దానిపై కన్నేసిన మిల్లు యజమాని ఆ ధాన్యాన్ని తాకట్టు పెట్టి భారీ మొత్తంలో అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయం ఇవాళ వెలుగుచూడటంతో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.