: మహబూబ్ నగర్ జడ్పీ సమావేశం రసాభాస... అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఈ రోజు జరిగిన మహబూబ్ నగర్ జిల్లాపరిషత్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల మధ్య వాదులాట జరిగింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుకు గాయాలయ్యాయి. దీంతో, తనపై దాడి చేసిన చిట్టెం రామ్మోహన్ పై అట్రాసిటీ కేసు పెట్టాలని బాలరాజు డిమాండ్ చేశారు. పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో, గొడవ పెరగకుండా ఇద్దరికీ నచ్చజెప్పారు పోలీసులు.