: సన్నీ లియోన్ ని సపోర్ట్ చేస్తున్న శిల్పా శెట్టి
'మ్యాన్ ఫోర్స్' కండోమ్ లో సన్నీ లియోన్ నటన యువతను రెచ్చగొట్టేలా ఉందని, ఆ యాడ్ అత్యాచారాలను ప్రేరేపించేదిగా ఉందని సీపీఐ ఎంపీ అతుల్ కుమార్ అంజాన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సన్నీలియోన్ మాట్లాడుతూ, తనపై విమర్శలు చేస్తూ శక్తి వృథా చేసుకోకుండా, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని రిటార్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో సన్నీ లియోన్ కి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి బాసటగా నిలిచింది. సన్నీ లియోన్ యాడ్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదం అని శిల్పా పేర్కొంది. ఆ యాడ్ చూసిన వారు అలా ఆలోచిస్తారని తాను భావించడం లేదని, దీని గురించి ఎక్కువ స్పందించడం మంచిది కాదని స్పష్టం చేసింది. ఒక చేతికి ఉండే ఐదు వేళ్లూ ఒకేలా ఉండవు, సానుకూల అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాలని శిల్పాశెట్టి సూచించింది.