: విశాఖ విమానాశ్రయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానాశ్రయ ఆభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి విమానయాన రంగం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్ పోర్టులో ఉన్న 8 పార్కింగ్ బే ల సంఖ్యను 14కు పెంచనుంది. ఇందు కోసం రూ. 60 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త పార్కింగ్ బేల ఏర్పాటు వల్ల విమాన రాకపోకల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని, వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి కొత్త పార్కింగ్ బేలు అందుబాటులోకి వస్తాయని పౌరవిమానయాన సంస్థ అధికారులు తెలిపారు. విభజన చట్టానికి అనుగుణంగా విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచాలన్న విషయం తెెలిసిందే.