: కేసీఆర్ కు కేంద్ర బలగాల భద్రతను తొలగించిన మోదీ సర్కారు


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు కల్పిస్తున్న కేంద్ర బలగాల భద్రతను తొలగిస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, కేంద్రం భద్రత కల్పిస్తున్న మరో 30 మంది వీఐపీల వద్ద పనిచేస్తున్న బలగాలనూ ఉపసంహరించుకుంది. కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబంలోని 8 మంది, మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, టెలికం శాఖ మాజీ మంత్రి, 2జి కుంభకోణం నిందితుడు ఎ రాజా, జమ్మూకాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కే. సిన్హా, ఎన్ హెచ్ఆర్సీ చైర్ పర్సన్ కేజీ బాలకృష్ణ, కేరళ గవర్నర్, మాజీ సీజే పి సదాశివం, ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, కేంద్ర మాజీ మంత్రులు సుబోద్ కాంత్ సహాయ్, వీ నారాయణ స్వామి, జితిన్ ప్రసాద్, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ తదితరుల పేర్లూ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన వెలువరించింది. ఇకపై వీరి భద్రతను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే చూసుకుంటాయని తెలిపింది. అన్ని విషయాలూ సమగ్రంగా చర్చించామని, వీరికి ఉన్న థ్రెట్ పరిశీలించామని, ఆపైనే భద్రతా దళాలను ఉపసంహరించుకున్నామని వివరించింది.

  • Loading...

More Telugu News