: ప్రభాస్ వర్సెస్ పవన్... అభిమానుల ఘర్షణలతో భీమవరంలో తీవ్ర ఉద్రిక్తత
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇద్దరు తెలుగు హీరోల అభిమానుల మధ్య యుద్ధం జరుగుతోంది. టాలీవుడ్ లో ప్రముఖ హీరోలుగా పేరున్న పవన్ కల్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రెండు కులాల మధ్య గొడవగా మారిపోయింది. ఒక హీరో ప్లెక్సీలను మరో హీరో అభిమానులు తగులబెట్టుకుంటూ, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. దీంతో భీమవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు నేడు, రేపు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అల్లర్లకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని, వారి చదువు నాశనమవుతుందని హెచ్చరిస్తున్నారు. కాగా, తమ అభిమానుల గొడవలపై అటు పవన్ గానీ, ఇటు ప్రభాస్ గానీ ఇంతవరకూ స్పందించలేదు.