: మిషన్ కాకతీయ, గ్రామజ్యోతి పథకాలకు మాజీ సైనికుల విరాళం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, గ్రామజ్యోతి పథకాలకు మాజీ సైనికులు విరాళం ప్రకటించారు. ఇందులో మిషన్ కాకతీయకు రూ.2 లక్షలు, గ్రామజ్యోతికి మరో రూ.2 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. విరాళాల చెక్ ను మాజీ సైనికోద్యోగులు ఈరోజు క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ కు అందజేశారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో అమలవుతున్న మిషన్ కాకతీయకు పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతరుల నుంచి విరాళాలు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ఎలాంటి నిధులు ఇవ్వడంలేదని తెలంగాణ మంత్రులు అంటున్నారు.