: ఏపీలో స్టడీ సెంటర్లు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్, తెలుగు యూనివర్సిటీల స్టడీ సెంటర్ల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో స్టడీ సెంటర్లు మూసివేయవద్దని, కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే సేవల నిర్వహణ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతాలను ఏపీ ప్రభుత్వమే భరించాలని ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. విభజన చట్ట ప్రకారం విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఏపీలో స్టడీ సెంటర్లు కొనసాగించడం వల్ల రూ.14 కోట్ల జీతాలు చెల్లించామని కోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఖర్చులు చెల్లిస్తే స్టడీ సెంటర్ల నిర్వహణకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News