: నాపై విమర్శలకు బదులు పేదలకు సాయపడండి: సన్నీలియాన్!
తనపై వస్తున్న విమర్శలపై సన్నీలియాన్ స్పందించింది. ఆమె నటించిన ఓ కండోమ్ ప్రచార ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తగా, ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తన వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. "అధికారంలో ఉన్న వ్యక్తులు తమ శక్తిని నాపై ప్రయోగిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. దీనికి బదులుగా అవసరమైన వారికి సహాయపడితే బాగుంటుంది" అని సలహా ఇచ్చింది. కాగా, ఆమె ప్రకటనలతో దేశంలో అత్యాచారాలు పెరిగిపోతాయని కొందరు నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో పోర్న్ చిత్రాల్లో నటించిన ఆమె, ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.