: మంత్రాలయంలోని శ్రీమఠం వసతి గృహంలో చోరీ
నిన్న రాత్రి మంత్రాలయంలోని శ్రీమఠం వసతి గృహంలో చోరీ జరిగింది. శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రయ్య గౌడ్, నర్సింహులు తమ కుటుంబ సభ్యులతో కలసి నిన్న మంత్రాలయంకు వచ్చారు. దర్శనం అనంతరం రాత్రి శ్రీమఠం వసతి గృహంలో బస చేశారు. వారు నిద్రిస్తున్న సమయంలో, అలికిడి లేకుండా వారి వద్ద నుంచి 8 తులాల బంగారం, ఓ సెల్ ఫోన్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే ఈ విషయాన్ని గమనించిన వారు, వెంటనే మంత్రాలయం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.