: ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెప్పనున్న ప్రణబ్ ముఖర్జీ


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తనున్నారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు గంట పాటు పాఠాలు చెప్పనున్నారు. ఈ అరుదైన ఘటన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రేపు జరగనుంది. రాజకీయాల్లోకి రాకముందు, అంటే 1969కి పూర్వం ప్రణబ్ ముఖర్జీ టీచరుగా, జర్నలిస్టుగా పనిచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్ కాంపౌండులోనే ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయా విద్యాలయాలో ప్రణబ్ విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారని, గంట పాటు ఆయన తీసుకునే క్లాస్ కు 100 మంది వరకూ ఉపాధ్యాయులు కూడా హాజరు కానున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంత్యుత్సవాలను సెప్టెంబరు 5న టీచర్స్ డేగా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News