: ఆర్బీఐ హెడ్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం...ఐదో అంతస్తులో ఎగసిపడుతున్న మంటలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రధాన కార్యాలయంలో నేటి ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని అర్బీఐ టవర్స్ లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో భవనం ఐదో అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో హుటాహుటిన అక్కడకు పరుగులు పెట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రంగా ఉన్న ఆర్బీఐలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై సర్వత్ర ఆందోళన నెలకొంది. ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.