: కేసీఆర్ చెప్పారు, జగన్ చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నడుస్తున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు అంశాన్ని కేసీఆర్ చెప్పిన మీదటే జగన్ సభలో ప్రస్తావిస్తున్నారనడానికి తమ వద్ద సాక్ష్యముందని అన్నారు. నిన్న కేసీఆర్, జగన్ కు ఫోన్ చేసి, ఇంకా సభలో ఓటుకు నోటు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగినట్టు తమకు తెలిసిందని, అందుకే సమావేశాల చివరి రోజున వైకాపా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ఇది మొత్తం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని, ప్రజలపై గౌరవముంటే ఇలా చేసేవాళ్లు కాదని అన్నారు. హైదరాబాదులో ఉన్న ఆంధ్రా ప్రజల సమస్యల గురించి వీరికి పట్టడం లేదని, 11 కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉండి, కోర్టు అనుమతిస్తే సభకు వచ్చిన జగన్ కు ఏ ఇతర కేసులనూ ప్రస్తావించే అర్హత లేదని నిప్పులు చెరిగారు.