: రైల్వేస్ లో హౌస్ కీపింగ్ నిర్వహణకు ప్రత్యేక విభాగం


రైళ్లలో, ఫ్లాట్ ఫారంలకు సంబంధించి హౌస్ కీపింగ్ నిర్వహణ వ్యవహారాలను చూసుకునేందుకు ప్రత్యేక విభాగాన్నిభారతీయ రైల్వేస్ ఏర్పాటు చేసింది. పరిశుభ్రత కోసం నిర్ణీత ప్రమాణాలు పాటించేందుకుగాను రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లలో, స్టేషన్లలో ప్రస్తుతం హౌస్ కీపింగ్ వ్యవహారాలను రైల్వేలోని పలు విభాగాలు చూస్తున్నాయి. దీంతో హౌస్ కీపింగ్ మెరుగుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. హౌస్ కీపింగ్ లో ఎంతో మెరుగైన నిపుణులు ఉన్నప్పటికీ వారి సేవలు అందించలేకపోతున్నామని రైల్వేకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వీటన్నింటినీ ఆలోచించి ఉత్తమ ఫలితాలను సాధించేందుకు హౌస్ కీపింగ్ కి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్లతో సహా 540 రైళ్లలో ఆన్ బోర్డు హౌస్ కీపింగ్ సేవలను అందిస్తున్నట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News