: కేజ్రీవాల్ కంటే ముందున్న గూగుల్


మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాంకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘనమైన నివాళి అర్పించాలని భావించారు. దీంతో ఆయన సేవలకు గుర్తుగా ఢిల్లీలోని ఔరంగజేబ్ మార్గ్ ను అబ్దుల్ కలాం మార్గ్ గా మార్చాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే కేజ్రీవాల్ ఇలా అన్నారో లేదో గూగుల్ అలా వెంటనే స్పందించింది. ఢిల్లీలోని ఔరంగజేబ్ మార్గ్ పేరును గూగుల్ మ్యాప్స్ లోంచి తొలగించి, ఆ స్థానంలో అబ్దుల్ కలాం మార్గ్ ను పేర్కొంది. దీనిని చూసిన నెటిజన్లు గూగుల్ అబ్దుల్ కలాంకి ఘనమైన నివాళి ఇచ్చిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News