: మహారాష్ట్ర వల్ల మరిన్ని ఇబ్బందులు: కేసీఆర్


గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్ర లెక్కలేనన్ని చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించడం వల్ల భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర చర్యలవల్ల భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు తప్పవని అన్నారు. ప్రాణహిత-ఇంద్రావతి నీటిని గరిష్ఠంగా వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నిర్మల్-ముథోల్ పెన్ గంగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణను నీటికటకటకు దూరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News