: సన్నిలియోన్ పై మండిపడ్డ సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ అంజన్
బాలీవుడ్ శృంగారతార సన్నిలియోన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ అంజన్ మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టేలా ఆమె కండోమ్ ప్రకటన ఉందని ఆ నేత విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని ఖాజీపూర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ తరహా యాడ్స్ ద్వారా దేశంలో అత్యాచారాలు పెరుగుతాయని అన్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సినిమాల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశ చరిత్రకు, సంస్కృతికి మచ్చతెచ్చేలా బాలీవుడ్ సినిమాలు ఉంటున్నాయన్నారు. సన్ని పోర్న్ సినిమాలపై కూడా అతుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్న్ అంటే తనకు పడదని, అటువంటివి చూసిన సందర్భంలో తాను వాంతి చేసుకున్నానని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.