: ఇలాగే ఉంటే కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు: నాగం


తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరవు పరిస్థితులను తాను ఎన్నడూ చూడలేదని బచావో తెలంగాణ మిషన్ కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం మొత్తం కరవుతో విలవిల్లాడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్రానికి కరవు నివేదిక కూడా పంపలేదని ఆరోపించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలే బాగుపడ్డారని విమర్శించారు. రైతులను ఆదుకోవడానికి కేసీఆర్ చైనా బాటను వదిలి, పంటచేల బాటను పట్టాలని సూచించారు. రైతు భరోసా యాత్ర సందర్భంగా ఈ రోజు ఆయన జడ్చర్ల, కల్వకుర్తి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటన సందర్భంగా నాగం వెనుక మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నేతలు మల్లయ్య గౌడ్, దుష్యంత్ రెడ్డి, నర్సింహులు తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News