: పాకిస్తాన్ లో మోదీని ఎంతమంది నమ్ముతున్నారు?
చరిష్మాకు మారు పేరు.. అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తుల్లో ఒకరు మన ప్రధాని నరేంద్రమోదీ. గత సాధారణ ఎన్నికల్లో సర్వం తానై పార్టీని విజయపథంలో నడిపించారు మోదీ. మనదేశంలో సరే, ఇతర దేశాల వారు మోదీని ఎంతవరకు నమ్ముతున్నారనే విషయమై వాషింగ్టన్ కు చెందిన ప్యూ రీసెర్చి సెంటర్ ఈ సర్వేను నిర్వహించింది. దీనిపై పది ఆసియా దేశాలకు చెందిన 15,000 మందిని ప్రశ్నించారు. వీరిలో వియత్నాం, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పైన్స్, దక్షిణ కొరియా, మలేసియా, చైనా, ఇండోనేషియా, పాకిస్థాన్ దేశాలకు సంబంధించిన వారు పాల్గొన్నారు. వారిలో మోదీని విశ్వసించే వారు వియత్నాంలో 56 శాతం ఉండగా, ఆస్ట్రేలియాలో 51 శాతం మంది ఉన్నారు. అలాగే, జపాన్ లో 47 శాతం మంది మోదీని విశ్వసిస్తే, ఫిలిప్పైన్స్ లో 44 శాతం మంది మోదీని నమ్ముతున్నామన్నారు. ఇంకా, దక్షిణ కొరియాలో 39 శాతం మంది, మలేషియాలో 34 శాతం మంది, చైనాలో 29 శాతం మంది, ఇండోనేషియాలో 28 శాతం మంది, పాకిస్థాన్ లో 7 శాతం మంది మోదీపై విశ్వాసం వ్యక్తం చేశారని ఆ సర్వే చెబుతోంది.