: చాయ్ అమ్మినంత ఈజీగా మోదీ దేశాన్ని అమ్మేస్తున్నారు: కార్మిక నేతలు
ఛాయ్ అమ్మినంత ఈజీగా ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడిదారులకు దేశాన్ని అమ్మేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. సుందరయ్య కేంద్రం వద్ద జరిగిన ర్యాలీ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు తీవ్రస్థాయిలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఛాయ్ అమ్మిన వ్యక్తి దేశానికి ప్రధాని అయితే ప్రజల కష్టాలు తీరుతాయని భావించామని, అలా జరగడం లేదని మండిపడ్డారు. కార్మిక చట్టాలను సవరించే ప్రతిపాదనను మోదీ విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పట్టపగలు సొంత ఇళ్లలోనే రక్షణలేదని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో మహిళలకు రాత్రి విధులు ఎందుకని వారు ప్రశ్నించారు. ఒకసారి ఎన్నికైన ప్రజాప్రతినిధి తరువాత ఓటమిపాలైనా 25 వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు నిత్యం పనిచేసే కార్మికుడుకి కనీస వేతనం 7,300 దేనికి సరిపోతుందని నిలదీశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ 20 వేలతో జీవించి చూపాలని వారు డిమాండ్ చేశారు.