: బాలీవుడ్ నటుల ఫ్యాషన్ తో... పాక్ లో భారత్ ఆభరణాలకు గిరాకీ


భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉన్నా వస్తువుల మార్కెట్ విషయంలో ఆదరణ మాత్రం తగ్గదని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం ఇక్కడ తయారవుతున్న అభరణాలనే పాక్ లో ఎక్కువగా కొనుగోలు చేయడం. అక్కడ మార్కెట్ లో మన దేశ ఆభరణాలనే బాగా కొంటారని డిజైనింగ్ నిపుణులు చెబుతున్నారు. గత శీతాకాలంలో పాక్ మార్కెట్ లో కొన్ని డిజైనర్ నగలను విడుదల చేస్తే కరాచీలో ఇప్పటికీ వాటికి మంచి గిరాకీ ఉందని చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం బాలీవుడ్ నటీనటుల ఫ్యాషన్ ను వారు ఎక్కువగా గమనించడమేనని, అందుకే మన ఆభరణాలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని పాక్ లో భారత ఆభరణాలను విక్రయించే ఫాతిమా అనే డిజైనర్ అంటున్నారు. ఈ విషయం తమకెలాంటి ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపారు. మొదట్లో తాను కొన్ని రకాల ఆభరణాలనే విక్రయించేదాన్నని, గిరాకీ పెరగడంతో ఇప్పుడు చాలా మొత్తంలో విక్రయాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా బాలీవుడ్ సినీ నటులు సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, శ్రద్ధాకపూర్, తదితరులు ధరించిన నగలు ప్రత్యేకంగా ఉంటాయని, వాటిని ఇక్కడ అమ్ముతున్నట్టు ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News