: ఎన్నిసార్లు చెప్పాలి మీకు? జగన్ పై స్పీకర్ ఆగ్రహం


"ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలి నేను. అర్థం చేసుకోలేరా? ఒక అంశంపై చర్చ చేపడితే, ఆ విషయంపైనే మాట్లాడాలి. ఇప్పటికే 40 నిమిషాలు మాట్లాడారు. మీరు ఎన్ని గంటలయినా మాట్లాడగలరు. ఆ విషయం నాకు తెలుసు. ఇంక సమయం ఇవ్వలేను. ఐదు నిమిషాల్లో ఏం చెబుతారో చెప్పండి. మరో అంశం జోలికి పోవద్దు. కేవలం కరవుకు మాత్రమే పరిమితం కావాలి. మరో విషయం ప్రస్తావించొద్దు" అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, విపక్ష నేత వైఎస్ జగన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు ఎవరు మాట్లాడినా, వైకాపా ఎమ్మెల్యేలు పోడియంలోనే ఉండటం సరికాదన్నారు. స్పీకర్ స్థానానికి మర్యాద ఇవ్వాలని కోరిన ఆయన, "జగన్మోహన్ రెడ్డి గారూ, మీరంటే నాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది" అన్నారు. కాగా, కరవుపై అసెంబ్లీలో చర్చ చేపట్టగా, అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News