: స్వల్పకాలిక చర్చ అంటే ఏమిటో మీకు తెలుసా?: జగన్ ను ప్రశ్నించిన స్పీకర్
వైకాపా అధినేత జగన్ పై స్పీకర్ కోడెల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై శాసనసభలో చర్చ జరుగుతున్న సందర్భంగా జగన్ పట్టిసీమ, పోలవరం అంశాలపై మాట్లాడటానికి ప్రయత్నించారు. అంతేకాకుండా తనకు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా మాట్లాడేందుకు యత్నించారు. ఈ సందర్భంగా స్పీకర్ కల్పించుకుని, స్పల్పకాలిక చర్చ అంటే ఏమిటో మీకు తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. చర్చించాల్సిన విషయాన్ని వదిలేసి, ఇతర విషయాల జోలికి వెళ్తుంటే... నిర్ణీత సమయంలో ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇలా చేస్తే, మీరే నష్టపోతారని అన్నారు.