: ఆర్థిక నేరాల్లో అవినీతిపరుల ఆస్తుల జప్తు చట్టసవరణకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలో తొమ్మిది బిల్లులకు ఆమోదం తెలిపారు. ఆర్థిక నేరాల్లో అవినీతిపరుల అస్తుల జప్తుకు అనుమతించే కీలక చట్టసవరణ బిల్లును సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సాగునీటి సంఘాల నిర్వహణ బిల్లు, గుర్రపు పందేల చట్టసవరణ బిల్లు, దేవాదాయ శాఖకు సంబంధించిన మరో చట్టానికి సవరణ చేసింది. ఇక డిపాజిటర్ల రక్షణ కోసం చట్ట సవరణ చేస్తూ కూడా మరో బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.