: మళ్లీ ఉపవాస దీక్షల్లో ప్రధాని నరేంద్ర మోదీ... నవంబర్ 22 దాకా ఒంటి పూట భోజనమేనట!


ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ఉపవాస దీక్షలను ప్రారంభించారు. చాతుర్మాస దీక్షల్లో భాగంగా గడచిన నెల నుంచే మోదీ ఒంటి పూట భోజనాలతోనే గడుపుతున్నారు. గతేడాది అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ లో ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా, మోదీ కోసం భారీ విందు ఇచ్చారు. అయితే చాతుర్మాస దీక్షల కారణంగా మోదీ కేవలం మంచినీటితోనే ఆ విందును ముగించారు. తాజాగా అమెరికా పర్యటన సమయంలోనే మోదీ చాతుర్మాస దీక్షల్లో ఉండటం గమనార్హం. నెల క్రితమే దీక్షలు చేపట్టిన మోదీ, నవరాత్రుల్లో కేవలం మంచి నీటిని మాత్రమే తీసుకుంటారు. ఈ దీక్షలు నవంబర్ 22న ముగుస్తాయట. గడచిన పదేళ్ల నుంచి మోదీ చాతుర్మాస దీక్షలను నిష్టగా పాటిస్తున్నారు.

  • Loading...

More Telugu News