: చైనా సైన్యంలో మరోసారి 3 లక్షల మంది సైనికులకు ఉద్వాసన!
చైనా సైన్యం... 23 లక్షల మంది సైనికులతో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సైనిక పటాలం. ఇక సైనిక ఖర్చు విషయంలో అగ్రరాజ్యం అమెరికా తర్వాత భారీ బడ్జెట్ కేటాయిస్తున్న దేశం కూడా చైనానే. 45 లక్షల మంది సైనికులతో కూడిన చైనా సైన్యం 1980 తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 1985లో 3 లక్షల మంది సైనికులను తగ్గించుకున్న ఆ దేశ సైన్యం, తదనంతర పరిణామాల్లో 23 లక్షలకు చేరుకుంది. తాజాగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నిన్న సైనికుల సంఖ్యను మరో 3 లక్షల మేర తగ్గిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రకటించారు. అంటే తాజా తొలగింపు ప్రక్రియ పూర్తైతే చైనా సైన్యంలో నికరంగా 20 లక్షల మంది సైనికులుంటారన్నమాట.