: కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం నుంచి తన యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేవాదుల ప్రాజెక్టు వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, కిషన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ యాత్రలో భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు పాలుపంచుకున్నారు.