: తానెవరినీ కించపరచలేదంటూ స్పీకర్ కు కేవీపీ మరో లేఖ
అసెంబ్లీ ఆవరణలో దివంగత వైఎస్ చిత్రపటం తొలగింపుపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పీకర్ కోడెలకు మరో లేఖ రాశారు. మొదట తాను రాసిన లేఖలో ఎవరినీ కించపరచలేదని, అమర్యాదగా లేఖ రాయలేదని తెలిపారు. అయితే తాను రాసిన మొదటి లేఖ అందలేదన్న తరువాతే రెండో లేఖ రాసినట్టు అందులో పేర్కొన్నారు. ఆ లేఖలో ఏమైనా అభ్యంతరాలుంటే వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏదేమైనప్పటికీ వైఎస్ చిత్రపటం తొలగించడం తనను ఆవేదనకు గురి చేసిందని, తిరిగి ఫోటోను పెట్టాలని కేవీపీ కోరారు.