: సభలో మీ పద్ధతి మార్చుకోండి... వైసీపీ సభ్యులకు స్పీకర్ హితవు
ఏపీ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరును స్పీకర్ కోడెల శివప్రసాదరావు తప్పుబట్టారు. పదే పదే సభలో పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తుండటంతో స్పీకర్ మందలించారు. మీ సభ్యుల ప్రవర్తన మార్చుకోవాలని వైసీపీకి సూచించారు. మిగతావాళ్లు మాట్లాడేటప్పుడు మీరు గొడవ చేయడం సరికాదని చెప్పారు. 'మీకు మళ్లీ మళ్లీ చెబుతున్నా పద్ధతి మార్చుకోండి' అని కోడెల తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు తమ పార్టీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందుకు నిరసనగా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో వేరొక సభ్యుడు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ పైవిధంగా స్పందించారు.