: ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: టీడీపీ నేత కొనకళ్ల సంచలన ప్రకటన


టీడీపీ సీనియర్ నేత, మచిలిపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల కోసం భూములిచ్చే ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. సర్కారీ భూసేకరణకు తాము అంగీకరించేది లేదని, పోర్టు కోసం భూములివ్వబోమని ఆరు గ్రామాల రైతులు హుసేనీపాలెం వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎంపీ కొనకళ్ల అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడారు. భూములిచ్చే రైతులకు నిబంధనల మేరకు పరిహారం ఇస్తామన్నారు. పరిహారం పంపిణీలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.

  • Loading...

More Telugu News