: కేవీపీ రాసిన లేఖను సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి: మంత్రి యనమల
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాన్ని అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించడంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పీకర్ కు రాసిన లేఖపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవీపీ స్పీకర్ కు రాసిన లేఖను సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. స్పీకర్ అనుమతి లేకుండా అసెంబ్లీ ఆవరణలో వైఎస్ ఫోటో పెట్టడం సరికాదని చెప్పారు. దానిపై ఎలాంటి ఫిర్యాదు లేకుండానే చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. కేవీపీ సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.