: వైసీపీ కాదు... సైకో పార్టీ: అచ్చెన్నాయుడు


ఈ రోజు కూడా వైకాపా సభ్యులు అసెంబ్లీలో తమ నిరసనను వ్యక్తం చేస్తూ, సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ కాదు... సైకో పార్టీగా పేరు మార్చుకోవాలని మండిపడ్డారు. ప్రతి విషయానికి వైకాపా సభ్యులు పోడియం వద్దకు వస్తున్నారని... ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. అత్యంత విలువైన అసెంబ్లీ సమావేశాల సమయాన్ని వృథా చేయరాదని చెప్పారు. అయినప్పటికీ, వైకాపా సభ్యులు మరోసారి పోడియంను చుట్టముట్టడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News